Saturday, October 4, 2025
ePaper
Homeరాజకీయంసిఎం రేవంత్‌తో పిసిసి చీఫ్‌ బేటీ

సిఎం రేవంత్‌తో పిసిసి చీఫ్‌ బేటీ

బిసి రిజర్వేషన్లు, తాజా రాజకీయాలపై చర్చ

తాజా రాజ‌కీయ‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృత్తంగా తీసుకెళ్లడంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పీసీసీ, పీఏసీ భేటీ ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు, కార్పొరేషన్‌ డైరెక్టర్ల పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జనహిత పాదయాత్రలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News