ఆరుగురి మృతి.. 800 మంది క్షతగాత్రులు
దక్షిణ బ్రెజిల్(Brazil)లో సుడిగాలి (Tornado) బీభత్సం చోటుచేసుకుంది. రియో బోనిటో డో ఇగువా (Rio Bonito do Iguacu) టౌన్‌ను భయంకరంగా వణికించింది. దీంతో.. ఆరుగురు చనిపోయారు. 800 వందల మంది గాయపడ్డారు. గాలులు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచాయి. ఈ ధాటికి దాదాపు 90 శాతం పట్టణం నేలమట్టమైంది. వందలాది ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి (Houses Damage). వాహనాలు గాలిలోకి ఎగిసి కిందపడ్డాయి. గాలుల తీవ్రతకు జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ఆరుగురు మరణించగా (Died) దాదాపు 800 మంది క్షతగాత్రులయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు (Supportive Measures) చేపట్టారు. అనేక మందికి నిలువ నీడ లేకుండా పోయింది. బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
