హైదరాబాద్(Hyderabad)లో ఇవాళ మధ్యాహ్నం నాటికి కిలో వెండి రేటు రూ.1.92 లక్షలు పలుకుతోంది. తులం(Ten Grams) బంగారం ధర రూ.1.32 లక్షలు చెబుతున్నారు. అయితే.. వెండి రేటు ఈ రేంజ్‌కి రావటం గమనార్హం. కరెక్టుగా ఏడాది కిందట లక్ష రూపాయల మార్కు దాటిన సిల్వర్.. ఈ రోజు రూ.2 లక్షల మార్కు దిశగా దూసుకెళుతూ ఉండటం విశేషం. వెండి ధర ఆకాశాన్నంటుతూ ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు (America Central Bank) వడ్డీ రేట్లు (Interest Rates) తగ్గిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. వెండి సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. పారిశ్రామికం(Industrial)గా సిల్వర్ అవసరం పెరుగుతోంది. డిమాండ్(Demand)కు తగిన స్థాయిలో ఉత్పత్తి (Production) పెరగట్లేదు.

