Wednesday, March 4, 2026
Homeభక్తిTirupati | ఆధునిక హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్..

Tirupati | ఆధునిక హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్..

  • శ్రీవారి భక్తులకు ఇక మరిన్ని సౌకర్యాలు..

తిరుమలకు తరచూ లక్షలాది మంది శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా తిరుపతికి చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సులు, క్యాబ్‌ల ద్వారా తిరుమల కొండపైకి వస్తారు. ఇక రైళ్ల విషయానికొస్తే.. తిరుపతికి రైల్వేశాఖ అనేక ట్రైన్ సర్వీసులను నడుపుతోంది. దీంతో తిరుపతి వైపు వెళ్లే రైళ్లు ఎప్పుడూ ప్రయాణికుల రద్దీతో నిండిపోయి ఉంటాయి. కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు.

ఇక ప్రయాణికుల తాకిడి కారణంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉంటుంది. దీని వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. స్టేషన్ నుంచి బయటకు రావాలన్నా లేదా లోపలకు పోవాలన్నా రద్దీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించే పనులు రైల్వేశాఖ చేపట్టింది. ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. ఇవి పూర్తైతే రైల్వే స్టేషన్ రూపురేఖలే పూర్తిగా మారనున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి రోజూ 182 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం ఆరు ఫ్లాట్‌ఫామ్స్, ఐదు ఫిట్‌లైన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు ఇవి సరిపోవడం లేదు. దీంతో అదనంగా ఐదు ఫ్లాట్‌ఫామ్స్‌ను రైల్వేశాఖ కొత్తగా నిర్మిస్తోంది. దీంతో ఫ్లాట్‌ఫామ్‌ల సంఖ్య 11కి పెరగనుంది. ఇక ఫ్లాట్‌ఫామ్స్‌కు సులువుగా చేరుకునే విధంగా లిప్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు.

ఇక ఉత్తర, దక్షిణ దిశల్లో రెండు భారీ భవన సముదాయాలు నిర్మించనున్నారు. వీటన్నింటి కోసం రూ.321 కోట్లు ఖర్చు చేయనున్నారు. దక్షిణ దిశలో నిర్మిస్తున్న భారీ భవనం ఇప్పుడే పూర్తి కావొచ్చింది. దీనిని మార్చి నాటికి ప్రారంభించేందుకు రంగం సిద్దమవుతోంది. ఇక ఉత్తర దిశ భవనం డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News