Monday, March 30, 2026
Homeఆంధ్రప్రదేశ్TTD | తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం..

TTD | తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం..

  • అందజేసిన బిల్వ ఇన్ఫ్రా సంస్థ, దేవి ఫిషరీస్ సంస్థలు..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇద్దరు భక్తులు రూ.2కోట్లు విరాళంగా అందజేశారు. బెంగుళూరుకు చెందిన బిల్వ ఇన్ఫ్రా సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ప్రవీణ్ ఎస్.నాయర్ తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణ కు విరాళం డీడీని అందజేశారు.

అదే విధంగా విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000 విరాళంగా అందించింది. ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్‌కు విరాళం డీడీని అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News