- వారు సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది..
- బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు.. ఖచ్చితంగా ఓట్లు వేస్తారు..
- ఆశాభావం వ్యక్తం చేసిన బీజేపీ అధికారిక ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు..
బీజేపీ అధికారిక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, నేటితో మున్సిపల్ ఎన్నికలు ముగియబోతున్నాయి, ప్రజలు సరైన నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమైందని, ప్రజలు బీజేపీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారని, ఎంతో ఆదరిస్తున్నారని, ఈ సారి బీజేపీ కి ఓటు వేయాలని ప్రజల్లో ప్రబలంగా కనబడుతున్నదని ఈ సందర్భాన్ని జీర్ణించుకోని కాంగ్రెస్ బీ,ఆర్.ఎస్.,లు తిట్ల దండకం తో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారు, ఇంతకు మునుపు 2 సార్లు అధికారంలో ఉన్న బీ.ఆర్.ఎస్. ప్రజలకు ఎన్నో వరాలిచ్చి తీర్చలేదు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ అంతకు మించి వరాలిచ్చి తీర్చలేక ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక పిచ్చి పిచ్చిగా తిట్ల దండకంతో ప్రజల్లో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.
మన ముఖ్యమంత్రి వర్యులు అమెరికా లో హార్వర్డ్ యూనివర్సిటీ లో రాజకీయ పాఠాలు నేర్చుకొని తన బుద్ధి మార్చుకుంటారని అనుకుంటే ఇంకా తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఉంది. అంతా అవినీతి, అక్రమాలు, భూదందాలు, కమిషన్లతో ప్రజలు విసిగిపోయిండ్రు అందుకే బీజేపీ నాయకులైన రామచందర్ రావు, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, మహారాష్ట్ర మంత్రి రమేష్ షెల్లాల్, ఎన్నికల ఇంచార్జీ అయినటువంటి అభయ్ పాటిల్, ప్రచారంలో తిరుగుతున్నారు వీరికి ప్రజలలో మంచి స్పందన కనబడుతుంది.
బీజేపీ దేశంలో వికసిత భారత్ లాగా తెలంగాణాకు కూడా వికసిత తెలంగాణా పేరుతో ఒక ఎజెండా ప్రకటించడం జరిగింది.. కాంగ్రెస్ హామీలు అన్నీ 420 చీటింగ్ అని ప్రజలు పత్రికా ముఖంగా అడుగుతున్నారు.. ఎక్కడ డంపింగ్ యార్డులు అక్కడే ఉన్నాయి, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారంలో వచ్చిన 100 రోజుల్లో కేసీఆర్ ను జైల్లో పెడతామన్నారు, ఇంకా వంద రోజులు కాలేదా? ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం కోసమే ఎఫ్.ఎస్.ఎల్. ల్యాప్ తగలబడడంతో సందేహాలు వస్తున్నాయి, కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. ఇద్దరూ..
మేము అధికారంలో ఉంటే మిమ్మల్ని కాపాడుతాం, మీరు అధికారంలో ఉంటే మమ్మల్ని కాపాడుండ్రి అన్నట్టు ఇద్దరూ దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు చేస్తున్నారు. ఇక ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంట కాగుతుంది, ఒకప్పుడు కారు స్టీరింగ్ మా దగ్గరే ఉంది అని అనే వాడు, మరి ఇప్పుడు కాంగ్రెస్ తో ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే అవినీతి లేని పాలనను అందించే, అభివృద్ధిని చూపించే బీజేపీ, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల గురించి మాట్లాడుతుంది కావున బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు కోరుకుంటున్నాను అన్నారు..
