Saturday, October 4, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్వైభవంగా శ్రీ వకుళామాత ఆలయ వార్షికోత్సవం

వైభవంగా శ్రీ వకుళామాత ఆలయ వార్షికోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో శ్రీ వకుళామాత వారి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపాన పేరూరు బండపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి తల్లియైన శ్రీ వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా ఉదయం నుండి రాత్రి వరకు కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5.30 గం.ల నుండి 6.00 గం. ల వరకు సుప్రభాతం, ఉదయం 06.00 – 08.00 గం.ల వరకు నిత్య కైంకర్యాలు, మూలవర్లకు అభిషేకం, అలంకారం, నివేదన చేపట్టారు. ఉదయం 09.00 గం.ల నుండి 11.00 గం.ల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనము, అంకురార్పణం, మహా శాంతిహోమం, పూర్ణాహుతి పూజలను నిర్వహించారు. ఉదయం 11. గం.ల నుండి 12 గం.ల వరకు ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శతకలశాభిషేకం, మధ్యాహ్నం 12 గం.ల నుండి 01.00 గం. వరకు శుద్ధి, అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం చేపట్టారు.

రూ.4.50 లక్షల విలువైన బంగారు పూత వెండి కిరీటం బహుకరణ
శ్రీ వకుళామాత వారి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్బంగా హైదరాబాద్ కు చెందిన శ్రీ ఆర్. అమరనాథ్, శైలజ దంపతులు శ్రీ వకుళామాత అమ్మవారికి రూ. 4.50 లక్షల విలువైన బంగారు పూత పూసిన వెండి కిరీటాన్ని ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీకి అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ శివప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News