సైకిల్ ర్యాలీ సందర్భంగా మల్కాజిగిరి సీఐ సత్యనారాయణ వ్యాఖ్య
మల్కాజిగిరి: పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో (Police Martyrs’ Week Celebrations) భాగంగా సోమవారం సైకిల్ ర్యాలీ (Cycle Rally) నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అమర వీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమం మల్కాజిగిరి పోలీసుల (Malkajgiri Police) ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ నుంచి మల్కాజిగిరి కూడలి వరకు జరిగింది. ఇందులో స్కూల్ విద్యార్థుల(School Students)తో కలిసి సిఐ సత్యనారాయణ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎంతో మంది పోలీసులు తమ విధి (Duty) నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. అలాంటి పోలీస్ అమర వీరుల త్యాగాలు మరవలేనివని చెప్పారు.
