భవిష్యత్తు (Future) పర్యాటకానిదేనని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) అన్నారు. లండన్(London)లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్(Wordl Travel Market)-2025 ముగిసిన అనంతరం ఇండియన్ హైకమిషన్ (Indian High Commission) ఏర్పాటుచేసిన హైటీ కార్యక్రమంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఏపీలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి పర్యాటకంతోపాటు ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు (Investments) పెట్టాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. భరోసా కల్పించే బాధ్యతను తాను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు లండన్‌లో జరిగిన ఆయన పర్యటన (Tour) ముగిసింది. డబ్ల్యూటీఎం (WTM) ప్రదర్శనలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్ర పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మంచి వేదికగా ఉపయోగపడిందని తెలిపారు. ఈ సందర్భంగా డబ్ల్యూటీఎం సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ పర్యాటక ప్రతినిధులను మంత్రి కందుల దుర్గేష్ ఏపీకి ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా (Industrial status) ఉందని, నూతన పర్యాటక పాలసీని విడుదల చేశామని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిలో పర్యాటక రంగం గేమ్ ఛేంజర్ (Game Changer) అని, ఈ క్రమంలో ఏపీ పర్యాటకాభివృద్ధికి సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉందని వివరించారు. మంత్రి కందుల దుర్గేష్ 3 రోజుల లండన్ పర్యటన ముగియడంతో ఏపీకి తిరుగుప్రయాణమవుతారు.
Tourism | భవిష్యత్తు పర్యాటకానిదే
- Advertisement -
RELATED ARTICLES
