సూర్యాపేట జిల్లా (Suryapet District) తిరుమలగిరి మండల (Thirumalagiri Mandal) కేంద్రంలోని అనంతారం(Anantharam)లో 11వ శతాబ్దం(కాకతీయుల కాలం) (Kakatiya period) నాటి జీర్ణమైన సోమసూత్ర శివలింగం(Soma Sutra Shiva Lingam), ఆంజనేయస్వామి విగ్రహాలు (Anjaneya Swamy idols) బయటపడటంతో గ్రామస్తులు కార్తీక మాసం(Karthika Masam)లో మొదటి అభిషేక (Abhishekam) పూజా (Puja) కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల శివ భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఇక్కడ శిలా శాసనాలతోపాటు వాటిపైన సోమ సూత్రాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వందల ఏళ్ల కిందట ఈ శివాలయం పక్కన అనంతారం గ్రామం ఉండేదని పేర్కొంటున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ శివ లింగం తమ గ్రామంలో ఉండటం అదృష్టమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంపదను ఎవరూ చోరీ చేయకుండా ప్రభుత్వం తక్షణం రక్షణ కల్పించాలని కోరుతున్నారు. దేవాదాయ, పురావస్తు శాఖల అధికారులు వీటిని సందర్శించాలని సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో విలువైనవి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
