Wednesday, February 11, 2026
Homeబిజినెస్Layoffs due to AI | ఏఐ శకం.. జాబులు ఖతం..

Layoffs due to AI | ఏఐ శకం.. జాబులు ఖతం..

ప్రస్తుతం నడుస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence-AI) శకమని అమెజాన్ (Amazon) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) యాండీ జెస్సీ పలుమార్లు చెప్పిన నేపథ్యంలో దానికి తగ్గట్లే ఆ సంస్థ భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతోంది. పెద్ద సంఖ్యలో లేఆఫ్‌ల (Layoffs) ప్రకటన వచ్చింది. ప్రముఖ ఇ-కామర్స్ (E-Commerce) సంస్థ అయిన అమెజాన్ 14 వేల కార్పొరేట్ కొలువులను తొలగిస్తున్నట్లు (Corporate Jobs Cut) ఇప్పటికే తేల్చిచెప్పింది. ఇందులో ఇంజనీర్‌లే (Engineer) 1800 మంది ఉన్నారు. క్లౌడ్ సర్వీసులు, రిటైల్, అడ్వర్టైజింగ్, గ్రాసరీ తదితర విభాగాల్లో నౌకరీలు బంద్ అవుతున్నాయి. కృత్రిమ మేధపై ఖర్చు ఎక్కువగా చేస్తున్నందున జాబులు చేసేవారి సంఖ్య తగ్గుతుందని అమేజాన్ గత నెలలోనే పేర్కొంది. వినియోగదారుల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు నూతన మార్గంలో పయనిస్తున్నామని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News