వికృతంగా రీల్ చేసినవాళ్లు క్షమాపణ చెప్పాలి
ఆ రీల్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య డిమాండ్
తెలంగాణ వలస బతుకులను బొంబాయి-దుబాయి-బొగ్గుబాయి అని నిర్వచించుకొని రాష్ట్ర సాధనోద్యమంలో ఎంతో ప్రభావితంతో కనిపించిన పాట.. ‘అమ్మ పయిలం.. తల్లి మాయమ్మ’(Public Song). ఈ పాట పాడిన సంతోష్(Santosh)కు ఈ పాట పేరే వచ్చింది. అదే.. పయిలం సంతోష్. అలాంటి పాటను కోదారి శ్రీను రాయగా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం(Telangana Movement)లో విస్తృతంగా ప్రచారం చేసింది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ACF). తెలంగాణ ధూం-ధాం వేదికలపైన వందలాది ప్రదర్శనలు ఈ పాట ద్వారా చేసింది.

అలాంటి ప్రజల పాటను, తెలంగాణ వలస జనుల కన్నీటి పాటను కొంత మంది ఆకతాయిలు రీల్ (Reel) చేస్తూ చాలా వ్యంగ్యంగా, అసభ్యంగా చిత్రీకరించారు. దీన్ని అరుణోదయ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ రీల్ చేసినవారు వెంటనే దాన్ని వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ (Sorry) చెప్పాలని డిమాండ్ చేసింది. ‘ఇది సోషల్ మీడియా (Social Media) వికృత చేష్టలకు పరాకాష్ట. ఎంతో మంది అమర వీరుల పాటలను (ఉదాహరణకు సుడిసిడి గుండాల అనే పాటను) పాటల చోరుడు.. రబ్బరు గాజులు, రైకలకు అని ఆపాదించి రాశాడు. చాలా మంది అమర వీరుల పాటలను అపహస్యం చేస్తున్నారు. వారందరినీ మేం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం (Warning).
ఇట్లాంటి ప్రజల పాటలను, ప్రజల పోరాట చరిత్రను వక్రీకరించొద్దు. పైగా ఈ పాట పాడిన సంతోష్ ప్రస్తుతం భౌతికంగా మన ముందు లేడు. అతడు అమరుడయ్యాడు. ఈ పాట వక్రీకరణ కేవలం పాటకు, ఉద్యమానికే కాకుండా అమరుడైన సంతోష్ కూడా అన్యాయం చేసినట్ల అవుతుంది. అతణ్ని కూడా ఎగతాళి చేసినట్లు అవుతుంది. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ (Demand) చేస్తున్నాం. నెటిజన్లు, ప్రజలు, ప్రజాభిమానులు, సాహిత్యాభిమానులు, ప్రజల పాటను అభిమానించే వాళ్ళందరూ దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి. ఇలాంటివారి చర్యల పట్ల నిరసనను ప్రకటించాలి. నిందితులకు తగిన బుద్ధి చెప్పాలి’ అని ఏసీఎఫ్ గౌరవ అధ్యక్షురాలు విమలక్క (Vimalakka), తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి మల్సూర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల కోరారు.
