Monday, October 27, 2025
ePaper
HomeరాజకీయంJubileehills | బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ

Jubileehills | బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

దీపక్ రెడ్డి నామినేషన్ అనంతరం కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ-మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (RamachandarRao) అన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. వారు పోటీలో ఉన్నట్లు నటించడమే తప్ప, వాస్తవానికి ప్రజలు ఇప్పటికే బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. నగరంలోని కాలనీల్లో డ్రైనేజ్ (Drainage) వాసనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ప్రతి రోజు మురుగు నీటి సమస్యలతో బాధపడుతున్నా ప్రభుత్వం స్పందించకుండా విఫలమైందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. డ్రైనేజ్ వాసనల సమస్య చిన్నది కాదని, ఇది నగర అభివృద్ధి(City Development)పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడించేదిగా ఉందని దుయ్యబట్టారు. రామచందర్ రావు గారు మాట్లాడిన ముఖ్యాంశాలు..

ధనికులు నివసించే మంచి కాలనీల పరిస్థితి ఇదైతే, సామాన్య ప్రజల స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకోవచ్చ. రాష్ట్ర ప్రభుత్వం గతంలో సివిల్స్ సిస్టమ్ మరియు డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చింది.., వాటి అమలుపై పెద్దగా పురోగతి లేదు. ప్రజలు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాగ్దానాలు చేసి పనులు చేయకపోవడమే పాలనగా మారిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు గతంలో ఏ ప్రభుత్వమూ అభివృద్ధి, పథకాల అమలులో సరైన ప్రాధాన్యం ఇవ్వలేద.., ముఖ్యంగా బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయ. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడంలో విఫలమయ్యారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడమే కనిపించింది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శ చేస్తూ, వారు చేసిన వాగ్దానాలు, ప్రచారాలన్నీ అబద్ధాల మీద ఆధారపడ్డవి. “ఆరు గ్యారెంటీలు” పేరిట 421 వాగ్దానాలు చేసి, మళ్ళీ ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పార్టీకి ప్రజలు పెట్టే సరైన బిరుదు “420 పార్టీ”.

ఇది IPC సెక్షన్ 420 ప్రకారం మోసానికి సంబంధించిన అంశాలను తలపిస్తుంది, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది సరిపోయే బిరుదు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తప్ప మిగతా పార్టీలు ప్రజలపై మాయాజాలం, అబద్ధాల ప్రచారం, తప్పుడు హామీలతోనే పోటీ పడుతున్నాయి. నిజమైన అభివృద్ధి, ప్రజల నమ్మకానికి, పారదర్శక పాలనకు బీజేపీయే ప్రత్యామ్నాయం. హైదరాబాద్ నగర అభివృద్ధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పురోగతి, శాంతి స్థిరత్వం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ ఉపఎన్నికను బీజేపీ విజయానికి తొలి అడుగుగా ప్రజలు చూడాల. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మార్పు వైపు తీసుకెళ్లే పాలన కోసం ఈ ఉపఎన్నిక ఎంతో కీలకo.

RELATED ARTICLES
- Advertisment -

Latest News