మేడ్చల్ నుండి గిర్మాపూర్ కు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమైన సందర్భంగా గిర్మాపూర్ లో వివిధ పార్టీల నాయకులు ఆర్టీసీ బస్సుకు పూజ కార్యక్రమం నిర్వహించారు, 6 సంవత్సరాల క్రితం రైల్వే అండర్ బ్రిడ్జి పనులు, హోసింగ్ బోర్డ్ రోడ్డు వల్లన ఆగిపోయిన బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమవడంతో గిర్మాపూర్ ప్రజలు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు..
వార్డు ప్రజల తరఫున డిపో మేనేజర్ కి సహకరించిన ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి మాజీ అధ్యక్షులు కొండం ఆంజనేయులు, మాజీ సర్పంచ్ చీర్ల బాలప్ప, మాజీ ఉపసర్పంచ్ బొక్క రఘుపతి రెడ్డి, నాయకులు వంగేటి హనుమంత్ రెడ్డి, వంగేటి రాజి రెడ్డి, ముక్కెర ఆనంద్, చీర్ల సత్యనారాయణ, బండి శ్రీనివాస్ గౌడ్, రాఘవ రెడ్డి, చీర్ల చంద్రశేఖర్, అంజి రెడ్డి, జనార్దన్ రెడ్డి, బండి సత్యం గౌడ్, చంద్రయ్య గౌడ్, అనిల్ రెడ్డి, మల్లా రెడ్డి, నీరుడి యాదగిరి, ముక్కెర అర్జున్, జావీద్, రాగం అర్జున్, వంశీ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లింగ సంతోష్, భాస్కర్ రెడ్డి, కృష్ణ పంతులు, రాములు తదితరులు ఉన్నారు.
