Wednesday, March 4, 2026
HomeతెలంగాణTGOs | నూతన ప్రధాన కార్యదర్శిగా బి.శ్యామ్

TGOs | నూతన ప్రధాన కార్యదర్శిగా బి.శ్యామ్

ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రకటన

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (Telangana Gazetted Officers Association) ప్రధాన కార్యదర్శి(General Secretary)గా బి.శ్యామ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు (Unanimously Elected) సంఘం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అందువల్ల ఆ పదవిలో కొత్త వ్యక్తిని జనరల్ సెక్రెటరీ కోఆప్షన్/ఎన్నుకోవటానికి 10-10-2025న మెదక్ జిల్లా ఏడుపాయల దగ్గర రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు (State President) ఏలూరి శ్రీనివాసరావుకి ఏకగ్రీవ తీర్మానంతో సంపూర్ణ అధికారం ఇచ్చారు.

- Advertisement -

తర్వాత ఈ నెల 5న రాష్ట్ర అధ్యక్షుడు ఈ ప్రక్రియను ప్రజాస్వామ్య పద్ధతిలో బై లా ప్రకారం పూర్తిచేయటానికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శికి అధికారం ఇచ్చారు. 24-10-2025న కూడా కేంద్ర అసోసియేషన్ సెక్రటేరియట్ సమావేశంలో విస్తృత చర్చ జరిగి అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం చాలా దఫాలుగా 33 జిల్లాలు రెండు స్పెషల్ బ్రాంచ్‌ల అధ్యక్ష కార్యదర్శులతో, సెంట్రల్ కమిటీలో ఉన్న సభ్యులతో అభిప్రాయ సేకరణ (Opinion Polling) తీసుకున్నారు. వ్యక్తిగత అభిప్రాయ సేకరణ కూడా చేశారు.

ఈ నెల 11న, 12న, 15న, 16న చివరిసారిగా 19న కేంద్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులందరి అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. విస్తృత అభిప్రాయ సేకరణలో భాగంగా మెజారిటీ సభ్యులందరు కూడా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి 01-01-2026 నాటికి ఏర్పడబోయే ఖలినీ నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే సంపూర్ణ అధికారం ఇచ్చారు. దీనిలో భాగంగా సంఘ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర అధ్యక్షుడికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి.శ్యామ్ (అసిస్టెంట్ కమిషనర్-రాష్ట్ర పన్నులు-సరూర్ నగర్-3 సర్కిల్) కోఆప్షన్/ఎంపిక చేయటం జరిగింది’ అని ప్రకటనలో వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News