Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణనిర్మల జగ్గారెడ్డి కూతురు వివాహం

నిర్మల జగ్గారెడ్డి కూతురు వివాహం

ఏబీఎన్ చీఫ్‌కు ప‌త్రిక అంద‌జేసిన టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తన కుమార్తె జయ రెడ్డి వివాహానికి ఏబీఎన్ చీఫ్ ఎడిటర్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వి. రాధాకృష్ణకు ఆహ్వానం అందించారు. శుక్రవారం రోజున నిర్మల జగ్గారెడ్డి స్వయంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించి, రాధాకృష్ణను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వివాహ ఆహ్వాన పత్రికను అందిస్తూ, పెళ్లికి తప్పకుండా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. తమ కుటుంబ సంతోషకార్యక్రమంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొనాలని కోరిన‌ట్లు స‌మాచారం. ఈ సందర్భంగా తన అభిమానం, ఆత్మీయతను వ్యక్తపరిచిన నిర్మల జగ్గారెడ్డి ఆహ్వానం అందించ‌డం సంతోషంగా ఉంద‌ని రాధాకృష్ణ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News