- రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
- నోటిఫికేషన్ విడుదల చేసిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ..
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీజీ ఐసెట్’- 2026 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ పర్యాయం సెట్ నిర్వహణ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)కు అప్పగించడంతో శుక్రవారం వర్సిటీలోని వీసీ చాంబర్‌లో ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ icet.tgche.ac.inలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.. అన్ రిజర్వ్‌డ్ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.750, రిజర్వ్‌డ్ క్యాటగిరీ అభ్యర్థులు రూ.550 చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసెట్ కో కన్వీనర్లు మిర్యాల రమేశ్‌కుమార్, సురేశ్‌రెడ్డి, యూనివర్సిటీ ఎంబీఏ విభాగం ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీలక్ష్మి, సరిత, లక్ష్మీప్రభ, ప్రవళిక, మారం వెంకటరమణారెడ్డి, సబీనా హెరాల్డ్, శ్వేత, పీహెచ్ డీ స్కాలర్ రమేశ్ నాయక్ పాల్గొన్నారు.
టీజీ ఐసెట్ – 2026 ముఖ్యమైన తేదీలు ఇవే :
టీజీ ఐసెట్ రిజిస్ట్రేషన్ ఈ నెల12 నుంచి మార్చి 16 వరకు.. ఆలస్య రుసుము రూ. 250తో మార్చి 30.. రూ.500తో ఏప్రిల్ 7.. రూ.5 వేలతో మే1.. రూ.10 వేలతో మే3 లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు.. దరఖాస్తుల సవరణకు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు అవకాశం.. మే 4 నుంచి ఐసెట్ హాల్ టికెట్లడౌన్ లోడ్ చేసుకోవచ్చు.. పరీక్షలు నిర్వహించే తేదీలు మే 13, 14.. పరీక్షల ప్రాథమిక కీ మే 29 కీపై అభ్యంతరాల స్వీకరణ మే 30 నుంచి జూన 5వరకు సమయం ఉంటుంది.. జూన్ 19న ఫైనల్ కీ, ఫలితాలు విడుదల అవుతాయి..
