Tuesday, March 3, 2026
Homeభక్తిLunar Eclipse | గ్రహణం రోజు ఆలయాలు మూసేస్తారు

Lunar Eclipse | గ్రహణం రోజు ఆలయాలు మూసేస్తారు

  • ఎందుకో తెలుసా..?

గ్రహణం రోజు..సూతకాలం ప్రారంభం అయినప్పటి నుంచీ ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించి…అప్పుడు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తారు. కానీ కొన్ని ఆలయాలు ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి. ఎందుకంటే గ్రహణం సమయంలోనూ ఇక్కడ ఆలయాలు తెరిచే ఉంటాయ్. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కేరళ రాష్ట్రంలో ఉన్న తిరువరప్పు ఆలయంలో కొలువైన కృష్ణుడికి చాలా ఆకలట. ఇక్కడ రోజుకి 10సార్లు నైవేద్యం సమర్పిస్తారు. గ్రహణం అని గుడి మూసేస్తే..స్వామివారు ఆకలికి తట్టుకోలేరని, విగ్రహం సన్నబడిపోతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ గ్రహణం సమయంలోనూ గుడిని మూసివేయరు..నైవేద్యం సమర్పిస్తారు.

- Advertisement -

రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయం కూడా గ్రహణం సమయంలో మూతపడదు. ఒకప్పుడు ఈ ఆలయాన్ని గ్రహణం రోజున మూసేశారట. అప్పుడు స్వామివారు…ఆలయం పక్కనే ఉన్న మిఠాయి దుకాణ వ్యాపారి కలలో కనిపించి చాలా ఆకలిగా ఉంది నైవేద్యం పెట్టమని అడిగారట. ఆ కలను ఆలయ పూజారులకు చెప్పడంతో..అప్పటి నుంచి గ్రహణ సమయంలోనూ ఆలయాన్న మూసివేయకుండా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు

శ్రీకాళహస్తిలో పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగగా కొలువయ్యాడు శంకరుడు. ఇక్కడ వాయులింగేశ్వరుడు 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. గ్రహాలను శాసించే స్వామికి గ్రహణం దోషం అంటుతుందా? అందకే శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సమయంలో రాహు కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం

కొండనే శివస్వరూపంగా, అగ్నిలింగంగా భావించే ప్రదేశం అరుణాచలం. నిత్యం భక్తులతో కళకళలాడే అరుణాచలం పౌర్ణమి వేళ మరింత రద్దీగా ఉంటుంది. అందుకే గ్రహణం అయినా కానీ అరుణాచలం ఆలయాన్ని మూసివేయరు. ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి

- Advertisement -
RELATED ARTICLES

Latest News