Thursday, March 5, 2026
HomeఫోటోలుReady To Release | ‘విచిత్ర’ విడుదలకు సిద్ధం

Ready To Release | ‘విచిత్ర’ విడుదలకు సిద్ధం

సైఫుద్దీన్ మాలిక్ (Saifuddin Malik) దర్శకత్వం(Direction)లో రూపొందిన హర్రర్ థ్రిల్లర్ మూవీ (Horror thriller movie) ‘విచిత్ర’ (Vichitra) విడుదలకు సిద్ధంగా ఉంది. రవి, శ్రీయ తివారి హీరో హీరోయిన్. సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. పేక్షకుల హృదయాలను (Heart) హత్తుకునేలా అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌(Family entertainer)లా మలిచారు. సెన్సార్ (censor) పనులు కూడా పూర్తయ్యాయి.

ఈ సందర్బంగా సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ..

- Advertisement -

ఈ సినిమాలో హీరోగా రవి, హీరోయిన్‌గా శ్రేయ తివారి, జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీ హర్షిణి యసిక, రవిప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలు పోషించారని చెప్పారు. ‘విచిత్ర’ ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన సినిమా అని తెలిపారు.

ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే కథ ఇది అని పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చూసే ఫ్యామిలీ డ్రామాగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించారు. కథ విషయానికి వస్తే అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త కోణంలో చూపించామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News