Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Telugu | తెలుగు మృతభాష కాదు… అమృత భాష

Telugu | తెలుగు మృతభాష కాదు… అమృత భాష

  • ఓయూ తెలుగు లిటరరీ కాంగ్రెస్‌లో విదేశీ తెలుగు ప్రతినిధుల వెల్లడి

తెలుగు మృతభాష కాదని,ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న అమృత భాష అని వివిధ దేశాల నుంచి హాజరైన తెలుగు ప్రతినిధులు స్పష్టం చేశారు.ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్ రెండో రోజు మంగళవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించారు.దేశ విదేశాలలో తెలుగు భాషా వ్యాప్తికి జరుగుతున్న కృషి–మార్గదర్శనం అనే అంశంపై పద్మ విభూషణ్ సంజీవ నరసింహ అధ్యక్షతన చర్చ జరిగింది.

హాంకాంగ్,అమెరికా,ఆస్ట్రేలియా,జర్మనీ తదితర దేశాల్లో తెలుగు భాషా బోధన,సాంస్కృతిక కార్యక్రమాలు,రేడియో ప్రసారాలు,టెక్నాలజీ ఆధారిత టూల్స్ ద్వారా తెలుగు సేవలు కొనసాగిస్తున్నట్లు వక్తలు వివరించారు.బాల్యం నుంచే తెలుగు భాషపై మక్కువ పెంచాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు.తెలుగు భాషా పరిశోధనలో శాస్త్ర సాంకేతిక సాధనాల వినియోగం అంశంపై జరిగిన మరో సదస్సులో ఆధునిక సాంకేతికతతో తెలుగు భాషను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

సోషల్ మీడియా–వైరల్ సాహిత్యం,యువ రచయితల సాహిత్యం,సీనియర్ రచయితల నుంచి యువత ఆశలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి,తెలుగు లిటరరీ కాంగ్రెస్ డైరెక్టర్,ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి. కాసిం తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News