తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల(Telangana wines tender) షెడ్యూల్‌ను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. ఈ లైసెన్సులు డిసెంబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఇవి నవంబర్ 30, 2027 వరకు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకు పెంచారు. ఈ ఫీజు,మద్యం దుకాణాల(Telangana wines Tender) లైసెన్స్ ద్వారా రూ.6,500 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా. 2023లో దరఖాస్తు ఫీజు ద్వారా రూ.1,350 కోట్లు వచ్చాయి. లైసెన్స్ ఫీజు ద్వారా రూ.3,500 కోట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు లైసెన్సులు కేటాయిస్తారు. లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తారు.
సెప్టెంబర్ 26 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 18 వరకు గడువు ఉంటుంది. గౌడ్‌లకు 15 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది. జనాభాను బట్టి పన్ను రేట్లు మారుతాయి. 5,000 లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.50 లక్షల పన్ను ఉంటుంది. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు రూ.1.1 కోట్లు పన్ను ఉంటుంది. మొదటి విడత పన్ను అక్టోబర్ 23, 24న చెల్లించాలి. కొత్త దుకాణాలు డిసెంబర్ 1, 2025న తెరుచుకుంటాయి.
మరిన్ని వార్తలు :