Sunday, February 22, 2026
HomeఫోటోలుSankranthi-2026 | తెలంగాణలో అంతర్జాతీయ పర్యాటకోత్సవాలు

Sankranthi-2026 | తెలంగాణలో అంతర్జాతీయ పర్యాటకోత్సవాలు

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్(International Kite & Sweet Festival), హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్(Hot Air Balloon Festival), డ్రోన్ షో–2026(Drone Show–2026)ను ఘనంగా నిర్వహించనున్నారు.

  • అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్.. జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌(Secunderabad Parade Grounds)లో జరుగుతుంది. ఇందులో 19 దేశాల నుంచి 40 అంతర్జాతీయ, 15 రాష్ట్రాల నుంచి 55 జాతీయ కైట్ ఫ్లైయర్లు పాల్గొంటారు. నైట్ ఫ్లైయింగ్, 100 చేనేత, హస్తకళల స్టాల్స్, 60 ఫుడ్ కోర్టులు, CLIC సహకారంతో 1,200కు పైగా రకాల మిఠాయిల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
  • హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్.. జనవరి 16, 17, 18 తేదీల్లో నిర్వహిస్తారు. ఐరోపా దేశాల నుంచి వచ్చే 15 అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్లతో ఉదయం హైదరాబాద్ శివార్లలో, సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నైట్ గ్లో బెలూన్స్ ప్రదర్శన జరుగుతుంది.
  • డ్రోన్ షో.. జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో అత్యాధునిక డ్రోన్లతో LED రేస్‌కోర్స్, FPV విజువల్స్, డ్రోన్ సాకర్‌తోపాటు తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రదర్శన ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయం, సాంకేతికత సమ్మేళనంగా తెలంగాణ పర్యాటకం మరో మెట్టు పైకి ఎక్కనుంది. తెలంగాణ జరూర్ ఆనా(తెలంగాణకు తప్పక రండి) అని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.
- Advertisement -
RELATED ARTICLES

Latest News