‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు హాజరుకావాలని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి (Telangana Minister) కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy).. శుక్రవారం సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబును కలిసి ఆహ్వానం పలికారు.
ఈ సదస్సును ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను దావోస్ సమ్మిట్ (Davos Summit) తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరవుతున్నట్లు చంద్రబాబుకు కోమటిరెడ్డి వివరించారు.
- Advertisement -
