Sunday, March 1, 2026
Homeకెరీర్ న్యూస్JL Exams | ఇక జేఎల్స్ కు ఐదేండ్లకోసారి పరీక్షలు..

JL Exams | ఇక జేఎల్స్ కు ఐదేండ్లకోసారి పరీక్షలు..

  • సూచించిన తెలంగాణ విద్యా కమిషన్..

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని జూనియర్‌ లెక్చరర్స్‌(జేఎల్స్‌)కు ఐదేండ్లకోసారి పరీక్ష పెట్టాలని తెలంగాణ విద్యా కమిషన్‌ సర్కార్‌కు సూచించింది. ప్రతి లెక్చరర్‌ ఈ పరీక్ష రాసి, అర్హత సాధించాల్సిందేనని ప్రతిపాదించింది. టీజీపీఎస్సీ లేదా మరో ఏజెన్సీ చేత పరీక్ష నిర్వహించాలని సర్కార్‌కు సమర్పించిన నివేదికలో కమిషన్‌ పేర్కొన్నది. ఇది కేవలం ప్రభుత్వ, ప్రభుత్వరంగ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి మాత్రమేనని తెలిపింది. ఈ పరీక్ష పాస్‌కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారన్న భయాలు లెక్చరర్లను పట్టిపీడిస్తున్నాయి.

భవిష్యత్తుల్లో నియమించే జేఎల్స్‌కు కొత్త అర్హతలుండాలని సూచించింది. ఇంగ్లిష్‌ మీడియంలో పీజీ చదివిన వారిని మాత్రమే జేఎల్స్‌గా తీసుకోవాలన్నది. అంతేకాకుండా బీఈడీ చదివి ఉండాలని, బీఈడీ, డిగ్రీ, పీజీలో 60% మార్కులు మస్ట్‌గా ఉండాలని పేర్కొన్నది. సీటెట్‌ లేదా తెలంగాణ టెట్‌లలో ఏదో ఒకదాంట్లో పాసై ఉండాలని, పాఠశాల, ఇంటర్‌లో ఏదో ఒక స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన వారే అర్హులుగా ఉండాలని ప్రతిపాదించింది.

- Advertisement -

ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని విద్యాకమిషన్‌ సూచించింది. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ మాడల్‌ను ప్రవేశపెట్టడంతో ఇంటర్‌విద్య ప్రత్యేకంగా అవసరంలేదని సూచించింది. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌లో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందిస్తుండటంతో ఇంటర్‌ విద్యను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఎస్సెస్సీ, ఇంటర్‌బోర్డులను విలీనం చేసి ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని, ఈ స్వతంత్ర బోర్డు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నియంత్రణలో ఉండాలని పేర్కొన్నది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News