రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే Arrive Alive అనే ఒక ప్రత్యేక రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు Telangana DGP వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ట్రాఫిక్ నియమాలను కఠినంగా పాటించాల్సిన అవసరం హెల్మెట్ మరియు సీటుబెల్ట్ వాడకం మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు Arrive Alive మిషన్ ద్వారా ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలనే సందేశాన్ని పోలీస్ శాఖ ప్రజల్లో నాటేందుకు కృషి చేస్తోంది.ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
