ప్రజా కవి, రచయిత డా. అందెశ్రీ మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తన అక్షరాలతో, పాటలతో కోట్ల మంది తెలంగాణ ప్రజల హృదయాలను తాకిన ప్రజా కవి డా. అందెశ్రీ
ఆయన రచించిన వేలాది కవితలు, పాటలు తెలంగాణ భాష, సంస్కృతులకు అద్దం పట్టాయి. నిత్య జీవితంలోని కష్టాలను, ప్రకృతి అందాలు, మానవ సంబంధాలను ఆయన కవిత్వం పట్టి చూపింది. ఆయన నవలలు మరియు గేయాలు తెలంగాణ పల్లె జీవితాన్ని, ఆకాంక్షలను బలంగా ప్రతిబింబించాయి. “జయ జయహే తెలంగాణ జనని జయ కేతనం” గీతం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారింది. ఇది కేవలం ఒక పాట కాదు, దశాబ్దాల ఉద్యమ పతాక చిహ్నం. రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన కలం పాత్ర చిరస్మరణీయమైంది. ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక కావడం ఆయన సాహిత్యానికి దక్కిన గొప్ప గౌరవం. ఆయన మన మధ్య లేకపోయిన అందెశ్రీ పాటలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఆయన మరణం తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడికి ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
రవి ప్రసాద్ గౌడ్… బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
పీ స్వరూప గౌడ్… బిజెపి మాజీ కార్పొరేటర్
