Tuesday, March 3, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐKTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ అభినందనలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ అభినందనలు

తెలంగాణ రాష్ట్రానికి(Telangana State) చెందిన ప్రవాస భారతీయుడు(NRI) ఉదయ్ నాగరాజు(Uday Nagaraju) బ్రిటన్‌(Britain)లోని పెద్దల (ఎగువ) సభ(House of Lords)కు నామినేట్ అయ్యారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Prime Minister Keir Starmer) రిఫరెన్స్ మేరకు ఆ దేశ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ (Brs Party) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్.. నాగరాజును అభినందించారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నియమితులైనందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘ఉదయ్ గతేడాది UK పార్లమెంట్ ఎలక్షన్‌లో పోటీచేయటం మొదలుకొని ఇప్పుడు ఈ అరుదైన గౌరవం పొందడం వరకు సాగించిన అద్భుత ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్న మీకు శుభాకాంక్షలు అని చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు 20 ఏళ్ల కిందట ఇంగ్లండ్ వెళ్లి స్థిరపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News