Wednesday, February 11, 2026
HomeతెలంగాణSupreme Court | పదిమంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలి

Supreme Court | పదిమంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలి

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్‌ జాప్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఏడాదిన్నర కావొస్తున్నా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం ప్రాజస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. సుప్రీంకోర్టు సైతం అనర్హత పిటిషన్లపై మూడు నెలలు గడువు ఇచ్చినా స్పీకర్‌ ఎటూ తేల్చకపోవడంపై సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

  • స్పీకర్ తీరును తప్పుపట్టిన సుప్రీం
  • నాలుగు వారాల్లో నిర్ణయం ప్రకటించాలి
  • ఎమ్మెల్యేలను విచారించి వివరణ ఇవ్వాలి
  • స్పీకర్పై కోర్టు ధిక్కార పిటిషన్..
  • విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం..
  • ఆగ్రహించిన సుప్రీం..

తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు – నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ను ప్రశ్నించిం ది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కర పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోక పోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ జరిగింది. కోర్టుధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్‌కి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌. గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే.. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి స్పష్టం చేశారు. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్‌ తరఫున న్యాయవాదులు అభిషేక్‌ సింగ్‌, ముకుల్‌ రోహత్గి వెల్లడిరచారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్‌కు మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఈలోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసు విచారణను కూడా 4 వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన పిటిషన్లపై మూడునెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జులై 31న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అయితే విభిన్న కారణాలవల్ల ఆలోపు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కానందున స్పీకర్‌కు మరో రెండునెలలు గడువు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన మిసిలేనియస్‌ అప్లికేషన్‌ సీజేఐ ధర్మాసనం ముందు 14వ నంబరులో లిస్ట్‌ అయింది. ఈక్రమంలో ఆయా పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్‌కు మరో 4 వారాల గడువు ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News