Wednesday, February 11, 2026
HomeరాజకీయంDisqualification | ఎమ్మెల్యేలపై అనర్హతకు అసెంబ్లీ స్పీకర్ నో

Disqualification | ఎమ్మెల్యేలపై అనర్హతకు అసెంబ్లీ స్పీకర్ నో

పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ(Brs Party) దాఖలు చేసిన పిటిష్లను తెలంగాణ శాసన సభ స్పీకర్(Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) తోసిపుచ్చారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని(No Sufficient Evidence) స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ కీలకమైన తీర్పు(Crucial Judgment) చెప్పారు.

దీంతో.. ఈ అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావ్‌(భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల్), ప్రకాష్‌ గౌడ్‌(రాజేంద్రనగర్), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు)పై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కోరిన సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే.. దీనిపై విచారణ జరిపిన స్పీకర్.. ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేలు పార్టీలు మారారనటం కేవలం ఆరోపణలే అని, వారంతా బీఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News