Friday, February 13, 2026
Homeతెలంగాణసీనియర్ న్యాయవాది ఎస్ఎస్ రావుకు ఘన సన్మానం

సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ రావుకు ఘన సన్మానం

ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ రావుకు తెలంగాణ హైకోర్టు అడ్మినిస్ట్రేటర్ జనరల్ అండ్ అఫీషియల్ ట్రస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించినందుకు తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఘన సన్మానం.

గత 26 సంవత్సరాలుగా నిర్విరామంగా హైకోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తూ నిరుపేదలకు న్యాయం శాస్త్రం, పై చట్టాలపై అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది నీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్కరికి నియమించే హైకోర్టు అడ్మినిస్ట్రేటర్ జనరల్ మరియు అఫీషియల్ ట్రస్ట్ ఆఫ్ తెలంగాణ సోమ శ్రీనివాసరావు ఎస్ఎస్ రావును నియమించినందుకు తెలంగాణ మేధావులు పురం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ నేతృత్వంలో శాలువా, జ్ఞాపిక పూలమాలతో హైకోర్టులోని తన చాంబర్లో ఘనంగా సన్మానించారు.

- Advertisement -

నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాఖ ఎల్ఎల్బీ పట్టా 1997లో పొందారు. కాంగ్రెస్ పార్టీలో 1982 నుండి 20 25 వరకు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని పార్టీ పటిష్టత కొరకు కృషిచేసి అందరి మన్నలను పొందారు. నిరుపేద గ్రామీణ మరియు హైదరాబాద్ నగర ప్రాంతంలోని ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ జాగృతి శిబిరాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. తన సేవలను గుర్తించి ఇంత పెద్ద పోస్ట్ నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు సహకరించిన మంత్రులు, శ్రీధర్ బాబు, సీతక్క మరియు మాజీ మంత్రి కె జాన రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ఎస్ రావు గతంలో ఎన్ ఎస్ యు ఐ మరియు యువజన కాంగ్రెస్ శాఖలలో 25 సంవత్సరాలుగా అనేక న్యాయపరమైన సమస్యలను, పార్టీ కార్యకర్తలకు తన శిబిరాల ద్వారా వివరించారు.

ఎస్ఎస్ రావుకు న్యాయవాదిగా సేవలందిస్తున్నందుకు ఎన్నో యువజన సంస్థలు, మహిళా సంఘాలు ఎన్నో పురస్కార ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా డిఎల్ పాండు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ సలహా సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, నరేందర్ మాజీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ హైకోర్టు, శ్రీకృష్ణశర్మ సీనియర్ న్యాయవాది శాతవాహన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు వెంకటరెడ్డి, న్యాయవాది డివి . శ్రీకాంత్, యువ హైకోర్టు న్యాయవాది కుమారి కె అఖిల మరియు టి.ఐ.ఎఫ్ కోఆర్డినేటర్ జి వేణుగోపాల్ తదితరులు ఎస్ ఎస్ రావుకు ఈ సందర్భంగా శాలువలు పుష్పగుచ్చం జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి అభినందించారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News