- ఆహారం, అద్దె, మధ్యాహ్న భోజన చెల్లింపులతో సహా ఎస్సీ, మైనారిటీ గురుకులాల పెండింగ్ బకాయిల విడుదల చేయాలి
- అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఎస్సీ, మైనారిటీ గురుకులాలకు సంబంధించిన పెండింగ్ రుసుములను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. మొత్తం 163 కోట్లు విద్యార్థుల డైట్, రెంట్, మిడ్డే మీల్ చెల్లిం పులకు ఖర్చవుతాయి. బుధ వారం సాయంత్రం ప్రజా భవన్లో భట్టి విక్రమార్కతో ఆర్థిక శాఖ, గురుకుల్ల అధికారులు సమా వేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాల హాస్టళ్లు, సంబంధిత సంస్థల పెండింగ్ డైట్, రెంట్, కాస్మెటిక్ ఛార్జీల గురించి చర్చించి తక్షణమే 51.36 కోట్లు విడుదల చేయమని ఆయన స్పష్టంమయిన ఆదేశాలు జారీ చేసారు.
మైనారిటీ గురు కులాలకు సంబంధించిన పెండింగ్ డైట్, రెంట్ చెల్లింపుల కోసం 47.61 కోట్లు, అలాగే మిడ్డేమీల్ స్కీమ్కు 63.92కోట్లు వెంటనే విడుదల చేయాలని ఉప సీఎం ఆదేశించారు. భట్టి విక్రమార్క తెలిపారు, విద్యార్థులకు పోషకాహారం, వైవిధ్యమైన, నాణ్యమైన భోజనంఅందించడంలో ఎలాంటి రాజీపడొద్దని ప్రభుత్వ సూచిం చిన మెనూని ఖచ్చితంగా పాటించవలసిందేనని హెచ్చరించారు. అనంతరం, ప్రభుత్వ విద్యాసంస్థలను ఫిక్స్ కేలెండర్ ప్రకారం పర్యవేక్షించి, అందిస్తున్న సదుపాయాలను సమీక్షించి, పూర్తి నివే దికలు త్వరగా సమర్పించమని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
అక్టోబర్లోనే భట్టి విక్రమార్కా, గురుకుల్ల, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్కు సంబంధించిన పెండింగ్ రుసుములను వెంటనే క్లియర్ చేయమని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం రాకుండా 92 కోట్లు విడుదల చేయ మని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మెస్, రెంట్, కాస్మెటిక్ చార్జీల బకాయిల వల్ల గురు కుల పాఠశాలల నిర్వ హణదారులు, సరఫరాదారులు ఆర్థికసమస్యలను ఎదుర్కొన్నారు.
సరైన భోజనం అందించడంలో సమస్యలు వచ్చి కొందరు సర ఫరాదారులు అప్పులు తీసుకొని మరీ పని చేశారు. ఇక భవనాల కిరాయి చెల్లించకపోవడం వల్ల కొంత కాల గురుకుల స్కూల్స్ మూసివేతకు దగ్గరగా ఉన్నాయి. BASSస్కీమ్లో భాగమైన ప్రైవేట్ పాఠశాలలు కూడా పెండింగ్ రుసుముల కారణంగా విద్యార్థుల ను తిరస్కరించడం లాంటివి కూడా జరిగినట్లు సమాచారం.
