Tuesday, February 10, 2026
HomeతెలంగాణGroup-3 | తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల

Group-3 | తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల

  • 1,370 మంది అభ్యర్థుల ఎంపిక
  • ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

తెలంగాణ గ్రూప్‌3 అభ్యర్థుల ఫలితాలు గురువారం విడుదల య్యాయి. సెలక్షన్‌ లిస్ట్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌3కి 1,370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో జరిగిన గ్రూప్‌`3 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. జూనియర్‌ అసిస్టెంట్‌, ఎల్‌డి స్టెనో, టైపిస్ట్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించిన పరీక్షకు సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

గ్రూప్‌ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌ టికెట్‌ నంబర్లు అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది. కోర్టులో ఉన్న పెండిరగ్‌ కేసుల తుది తీర్పుకు లోబడి ఈ ఫలితాల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఒక్క ఖాళీని ప్రస్తుతం విత్‌హెల్డ్‌ లో ఉంచింది కమిషన్‌. తప్పుడు వివరాలు సమర్పించినట్లు తేలితే ఎంపికను రద్దు చేస్తామని కమిషన్‌ హెచ్చరించింది. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌-3 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News