ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం(Madhira Constituency)లోని బోనకల్ మండలం రాయన్నపేట గ్రామం, ముష్టికుంట్ల గ్రామంలో బీటీ రోడ్డు(BT Road)కు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhatti Vikramarka) శంకుస్థాపన(Foundation Stone Laying) చేశారు. ఈ సందర్భంగా ఆయనకు రెండు గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ప్రజల అవసరాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -
