కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సచివాలయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వెళ్లిన ఆయన సమావేశం కొనసాగుతున్న సమయంలో ఛాతి నొప్పితో కూలిపోయారు. ఘటనను గమనించిన మంత్రి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. అక్కడే డిస్పెన్సరీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించారు. అనంతరం హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మధు యాష్కీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది.
