- జల్ జీవన్ మిషన్ లో విశేష కృషి..
రంగారెడ్డి జిల్లా, అమన్ గల్ మండలం, చెన్నంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ‘జల వనిత’గా తెలగమల్ల ఆనంద, ‘జల్ జీవన్ మిషన్’ అమలులో ఆమె చేసిన కృషికి గాను ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘జల్ మహోత్సవ్ ప్రచార కార్యక్రమం 2026’లో ఆమె పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ వంటి ప్రముఖులు అధ్యక్షత వహించారు. కాగా ఈ కార్యక్రమం కోసం తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం ముగ్గురు మహిళా సర్పంచులు, ముగ్గురు ‘జల వనితలు’ ,ముగ్గురు స్వయం సహాయక బృందాల మహిళలు ఎంపికయ్యారు.. ఎంపికైన ఆ ప్రతినిధులలో తెలగమల్ల ఆనంద ఒకరు. జల్ జీవన్ మిషన్ అమలులో ఆమె చేసిన విశేష కృషిని గుర్తించి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సోమవారం నాడు కొంగరకలాన్‌లోని ఐడీఓసీలో ఘనంగా సన్మానించారు.
