Saturday, February 21, 2026
Homeఖమ్మంPolytechnic | సాంకేతిక విద్య ద్వారా అవకాశాలు ఎక్కువ..

Polytechnic | సాంకేతిక విద్య ద్వారా అవకాశాలు ఎక్కువ..

  • సుభాష్ నగర్ ఉన్నత పాఠశాల హెచ్ ఎం. వెల్లడించిన ఎం. ఉమాశంకర్..

సాధారణ విద్యతో పాటుగా సాంకేతిక విద్యా అవకాశాలు కూడా నేడు బాగా పెరిగాయని, సాధారణ విద్య కంటే నేడు సాంకేతిక విద్య ద్వారానే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదవ తరగతి విద్యార్థులు తదుపరి సాధారణ విద్యతో పాటుగా సాంకేతిక విద్య పట్ల కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని.. సుభాష్ నగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. ఉమాశంకర్ పేర్కొన్నారు.

పాలీసెట్ 2026 అవగాహన కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన డి .శ్రీనివాసరావు (ఇంగ్లీష్ లెక్చరర్), పి.రమేష్ (లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్), ఎస్ కే జాన్ పాషా (లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ) సుభాష్ నగర్ ,ఇల్లందు పాఠశాలకు విచ్చేసి విద్యార్థులకు 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ కోర్సుల పట్ల అవగాహన కల్పించారు. పాఠశాల ఉపాధ్యాయులు పి అని ఇమెల్యా, సువర్ణ, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News