Tuesday, October 28, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుగురుకులంలో కీచక ఉపాధ్యాయుడు

గురుకులంలో కీచక ఉపాధ్యాయుడు

తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. కాగా, గతంలో కూడా విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేశాడని శ్రీనివాస్ పై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి..

RELATED ARTICLES
- Advertisment -

Latest News