Saturday, February 21, 2026
Homeవరంగల్‌Farmers | "తాయో" టి.ఎస్541 మిర్చి సీడ్స్ తో అన్నదాతలకు అధిక దిగుబడి

Farmers | “తాయో” టి.ఎస్541 మిర్చి సీడ్స్ తో అన్నదాతలకు అధిక దిగుబడి

‘తాయో టీఎస్ 541 సీడ్స్” తో మిర్చీ రైతులకు అధిక లాభం చేకూరుతుందని ఆ కంపెనీ టెరిటరీ సేల్స్ మేనేజర్ చెన్న శ్రీధర్ అన్నారు. శనివారం ములుగుజిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 150 మిర్చీ రైతులతో మండలంలోని మల్లూరులో రైతు కుంచనపల్లి అశోక్ సాగు చేస్తున్న తాయో టీఎస్ 541 మిర్చి తోటలో క్షేత్ర సందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు చెన్న శ్రీధర్ నివృత్తి చేశారు.అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..

“తాయో సీడ్స్” రైతుకు లాభదాయకమైన విత్తనాలు అందిస్తూ అధిక దిగుబడులను సాధించడంలో తోడ్పాటు అందిస్తుందన్నారు. తాయో టీఎస్ 541 మిరప రకం పొడవైన కాయలు చెట్టు కొమ్మల చివర వరకు కాస్తుందని ఆకర్షణీయమైన రంగు తెగుళ్లను తట్టుకునే తాలు లేని మేలైన అధిక దిగుబడిని అందిస్తుందన్నారు.ఈ పంటకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర ఉందని రైతులకు ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందన్నారు.

- Advertisement -

అనంతరం “తాయో టీఎస్ 541” సాగు చేస్తున్న రైతు కుంచనపల్లి అశోక్ పటేల్ ను రైతుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో “చందన సీడ్స్”మంగపేట సేల్స్ మేనేజర్ రాయల చంద్రశేఖర్, పలువురు రైతులు,కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News