Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణT. Harish rao | బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ఖాతాలోకి...హరీష్ రావు ఆరోపణలు

T. Harish rao | బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ఖాతాలోకి…హరీష్ రావు ఆరోపణలు

సిద్దిపేట జిల్లాలో పామాయిల్ సాగుకు, పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) రావు నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అపార కృషి వల్లే సాధ్యమైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (T. Harish rao) సోమవారం స్పష్టం చేశారు.

నంగునూరు మండలం నార్మెట్టలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం హరీష్ రావు(T. Harish rao) స్థానిక రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018లో ఈ ప్రాంతంలో పామాయిల్ సాగుకు తగినంత తేమ లేదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (IIOPR) అనుమతి నిరాకరించిందని గుర్తు చేశారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత జిల్లాలో జల విస్తరణ పెరిగి, తేమ శాతం కూడా పెరగడంతో 2021లో ఆ సంస్థ సాగుకు అనుమతిచ్చిందని ఆయన వివరించారు.

పామాయిల్ సాగును ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎన్నో నర్సరీలను ఏర్పాటు చేసిందని, ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ, సమావేశాలు నిర్వహించిందని హరీష్ రావు చెప్పారు. సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పామాయిల్ పంటలు పండించి ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలోనే ఫ్యాక్టరీ పనులు 75 శాతం వరకు పూర్తయ్యాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదని, కానీ మొత్తం వాళ్ళే చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. 2022లోనే ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో వంట నూనెకు అధిక డిమాండ్ ఉందని పేర్కొంటూ, రైతులు పామాయిల్ సాగు చేపట్టాలని హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ డా. వి. యాదవ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

“వైద్య, ఆరోగ్య శాఖలను వైసీపీ నాశనం చేసింది”

RELATED ARTICLES
- Advertisment -

Latest News