- బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా
అంతర్జాతీయ వేదికపై భారతీయ అధ్యాత్మికతను చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఎల్లంపేట బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ కొనియాడారు, సోమవారం స్వామి వివేకానంద,163 వ జయంతి సందర్బంగా ఎల్లంపేట్ మున్సిపాలిటి పరిధిలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద బిజెపి ఎల్లంపేట్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర నాయకులు యువమోర్చ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రస్తుతం బిజెపి కామారెడ్డి జిల్లా ఇంచార్జి విక్రమ్ రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎల్లంపేట్ జగన్ గౌడ్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ బిజెపి ప్రధాన కార్యదర్శులు కంచు గంట మహేష్, దాది ప్రకాష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ పోచయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

