Friday, March 6, 2026
Homeహైదరాబాద్‌BC Student Jac | బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్‌గా స్వామి గౌడ్

BC Student Jac | బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్‌గా స్వామి గౌడ్

తెలంగాణ రాష్ట్ర (Telangana State) బీసీ విద్యార్థి (BC Students) జేఏసీ చైర్మన్‌(Jac Chairman)గా ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) రీసెర్చ్ స్కాలర్ (Research Scholar) బొల్లేపల్లి స్వామి గౌడ్ (Bollepalli Swami Goud) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాచిగూడలో జరిగిన బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.

స్వామి గౌడ్ అనేక రాష్ట్ర స్థాయి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్నారు. ఇటీవల గ్రూప్-2 రద్దు పోరాటంలోనూ తన వంతు పాత్ర పోషించారు. ఎస్ఐ పరీక్షలో 8 మార్కులు, కానిస్టేబుల్ పరీక్షలో 22 మార్కులు కలపాలని పోరాటం చేసి విజయం సాధించారు. మెడికల్ డీమ్డ్ యూనివర్సిటీలు రాష్టంలోకి రాకుండా అడ్డుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు మెడికల్ సీట్లలో రిజర్వేషన్లు కోల్పోకుండా పోరాటం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

- Advertisement -

బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కౌశిక్, శ్రవణ్, అరవింద్, లక్ష్మణ్, సుభాష్, విగ్నేష్, గణేష్, సైదులు, శివ యాదవ్, లింగస్వామి, శ్రీకాంత్, రమేష్, లింగాల మహేష్, వెంకట్, రఘు, వంశీ, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News