Saturday, February 7, 2026
Homeనల్లగొండప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి.

  • ఓటర్లు సజావుగా ఓటు హక్కువినియోగించుకోవాలి.
  • సూర్యాపేట నుంచి కుడ కుడ వరకు ఫ్లాగ్ మార్చ్.
  • సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్.

రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. శనివారం సూర్యాపేట పట్టణం నుంచి కుడకుడ వరకు పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించిన పాత నేరస్థులను గుర్తించి వారిపై ముందస్తుగా బైండోవర్ చర్యలు చేపట్టామని తెలిపారు.

ఆయా వ్యక్తులపై ఐదు లక్షల రూపాయల పూచికత్తుతో బైండోవర్ అమలు చేసినట్లు స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐదు లక్షల రూపాయల పూచికత్తు రద్దుతో పాటు జైలు శిక్ష (రిమాండ్) అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు.

- Advertisement -

ఈ ఫ్లాగ్‌మార్చ్ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ, రూరల్ సీఐ లు,వెంకటయ్య, రాజశేఖర్, ఎస్సైలు శివతేజ,ఏడుకొండలు,సాయిరాం,మహేంద్ర నాథ్,బాలు నాయక్, మహేశ్వర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News