Wednesday, February 11, 2026
Homeనల్లగొండRains |సూర్యాపేట జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ హెచ్చరికలు

Rains |సూర్యాపేట జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ హెచ్చరికలు

  • జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. అధికారులను హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 6281492368 నంబర్‌ను విడుదల చేశారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని, కృష్ణ, మూసి నదుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యంపై టార్పాలిన్ పట్టాలు కప్పి ఉంచాలని, రైతులు వచ్చే రెండు రోజుల పాటు వరి పంట కోతను వాయిదా వేసి సహకరించాలని కోరారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసి చెరువులు, కాల్వల వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై లేదా కల్వర్టులపై నీరు ప్రవహిస్తే వాహన రాకపోకలు నిలిపివేయాలని సూచించారు.ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి, ప్రభుత్వ సూచనలను ఖచ్చితంగా అనుసరించాలి. సహాయక చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News