35 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు
సురక్ష సేవా సంఘం ఆధ్వర్యంలో చీకట్ల నుంచి వెలుగులోకి
ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 465 మందికి విజయవంతంగా చూపు ప్రసాదించిన సురక్ష సేవా సంఘం
సికింద్రాబాద్‌లోని పుష్పగిరి కంటి ఆసుపత్రిలో శ్రీధన లక్ష్మి ఆప్టికల్స్ వారి సహకారంతో విజయవంతంగా కొనసాగుతున్న సురక్ష కంటి వెలుగు కార్యక్రమం
నిరుపేదల పాలిట వరంలా మారిన సురక్ష ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరాలు
సురక్ష సేవా సంఘం (Surakha Seva Sangham) ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా చూపు లేని వృద్ధులను చేరదీసి ఉచితంగా కంటి ఆపరేషన్లు (Free Eye Operations) చేపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 465 మంది వృద్ధులకు చూపునివ్వడం జరిగింది.. శరీరంలోని ఏ అవయవం పని చేసినా పని చేయకున్నా… కంటి చూపు కోల్పోతే లోకమంతా చీకటే..దీనికి తో పాటు ఒంటరి వృద్ధుల బాధలు ఊహించుకో లేము…వీటిని దృష్టిలో ఉంచికొని వారికి ఆసరా(Aasara)గా నిలబడాలని సురక్ష సేవా సంఘం తెలంగాణ మరియు శ్రీ ధన లక్ష్మి ఆప్టికల్స్ వారు సికింద్రాబాద్ లోని పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సహకారం తో.. నిరుపేదలకు (Poor People) వెలుగు నివ్వడం జరుగుతుంది.

అబ్దుల్లాపూర్ మెట్టు, పరిసర ప్రాంతాల కి చెందిన వృద్ధులు10 మంది ఇంకా వరంగల్, జనగాం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన 25 మంది వృద్ధులకు విజయ వంతంగా కంటి ఆపరేషన్లు చేపించి..క్షేమంగా వారి గృహాలకు తరలించడం జరిగింది..సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపిశంకర్ యాదవ్ ఆదేశాలు మేరకు ఈరోజు సంఘ సభ్యులు దగ్గరుండి కంటి ఆపరేషన్లు జరిగిన వృద్ధులకు ఆసరాగా నిలబడటం జరిగింది. ఈ కార్యక్రమంలో,శ్రీ ధన లక్ష్మీ ఆప్టికల్స్ ఆప్టో మెట్రిస్ట్ G. రాజేష్ గౌడ్ , సలహా దారులు నాగవల్లి యాదగిరి,,సురక్ష సబ్యులు Sk యాకుబ్ , పాల్గొన్నారు.

