న్యాయం జరిగే వరకూ పెద్దఎత్తున ఉద్యమం
మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి
యాదగిరిగుట్ట పట్టణం(Yadagirigutta Town)లోని పాతగుట్ట రోడ్డు (Pathagutta Road) బాధితులకు (Victims) న్యాయం (Justice) జరిగే వరకు పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ పార్టీ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. బాధితులకు నష్టపరిహారం (Compensation) చెల్లించాలని డిమాండ్ (Demand) చేస్తూ గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గుట్ట చౌరస్తా వద్ద పట్టణ పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి రాస్తారోకో (Rasta Roko) చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట పునర్నిర్మాణ సమయంలో రోడ్లు, ఇండ్లు కోల్పోయినవారికి నష్టపరిహారం అందించాకే పనులు ప్రారంభించారని చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపరిహారంతోపాటు ఇళ్లు కోల్పోయినవారికి ఇళ్లు, ప్లాట్లు కోల్పోయినవారికి ప్లాట్లతోపాటు వైటీడీఏ పరిధిలో షాపులు కేటాయించాలని అన్నారు. బాధితుల ఆవేదన పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
అధికారులు బాధితుల వాదన వినకుండా ముందుకెళ్లడం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు పాత గుట్ట రోడ్డు బాధితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత పెద్దఎత్తున కొనసాగిస్తామని హెచ్చరించారు. సుమారు రెండు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి ఆందోళనకారులను సముదాయించడంతో రాస్తారోకో విరమించారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, నాయకులు దేవపూజ అశోక్, ఆరె శ్రీధర్ గౌడ్, పేరబోయిన సత్యనారాయణ యాదవ్, గడ్డం చంద్రం, కల్వకులను సతీష్ బట్, కొన్యాల నరసింహారెడ్డి, గంజి సూర్యనారాయణ, దండబోయిన వీరేష్ యాదవ్, ముక్కెర్ల శ్రీశైలం, గేదపాక క్రాంతి, పాండురాజు, ఉప్పలయ్య, భక్త కన్నప్ప, బుడిగే సత్తయ్య, పబ్బాల సాయి చిరంజీవి, బర్ల శివయ్య, ఎస్.కె.నజీర్, కన్నరాజు, గడ్డమీది రాజాలు, బండ రామస్వామి, సర్దార్, బాధితులు కోకల రవీందర్, కంసాని స్వామి, దేవేందర్, కంసాని శేఖర్, కంసాని కాళీ, బాలకృష్ణ, రవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
