Tuesday, March 24, 2026
Homeవరంగల్‌Mulugu | గోదావరి నది కి.. "సమ్మక్క బ్యారేజ్" ఆకస్మిక వరదనీరు

Mulugu | గోదావరి నది కి.. “సమ్మక్క బ్యారేజ్” ఆకస్మిక వరదనీరు

  • నిలిచిన మంగపేట
  • గోదావరి నది ఒడ్డు “కరకట్ట పనులు..”!

ములుగుజిల్లా మంగపేట మండలానికి గోదావరికి ఎగువన ఉన్న తుపాకులగూడెం “సమ్మక్క బ్యారేజ్” గేట్లు లేపి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరద నీరు వచ్చి మంగపేట మండల కేంద్రంలో గోదావరి నది తీర ప్రాంత ఒడ్డుకు 60 కోట్ల నిధుల తో కొంతకాలంగా జరుగుతున్న కరకట్ట నిర్మాణం పనుల కు తీవ్ర ఆటంకంగా ఏర్పడి ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

స్థానిక ఐబీ అధికారులకు, కరకట్ట కాంట్రాక్టు వర్గాలకు ఎలాంటి సమాచారం లేకుండా సమ్మక్క బ్యారేజ్ అధికారులు ఒక్కసారిగా గేట్లు లేపడంతో అకస్మాత్తుగా వచ్చిన వరదతో పనులు నిలిచిపోగా జేసీబీలు, గ్యాబియన్ మెస్, క్లాత్ ఇతర పరికరాలు వరదలో కొట్టుకపోయినట్లు కాంట్రాక్టు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తూ తమ ఆందోళన వెలిబుచ్చారు. గత కొంతకాలంగా ముమ్మరంగా పనులు జరుగుతున్న వేళ గోదావరినది లోకి వరదనీరు వదలడంతో రెగ్యులర్ నీటితో పాటు వరద నీరు కూడా వచ్చి పనులకు పెద్ద ఎత్తున ఆటంకంగా మారింది.

- Advertisement -

దీంతో అసలే కరకట్ట పనులు ఇప్పటికే ఆరు నెలలు ఆలస్యంగా నడుస్తున్న వేళ ఇలా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కాంట్రాక్టు ఉద్యోగులు పేర్కొన్నారు. నీటి విడుదల సమయంలో ఐబీ అధికారుల మధ్య సమన్వయం లేకనే సమ్మక్య బ్యారేజ్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేటు విడుదల చేసి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News