Saturday, February 21, 2026
HomeజాతీయంZero Enrolment | వేలల్లో బడులు.. ఒక్కరూ లేరు విద్యార్థులు..

Zero Enrolment | వేలల్లో బడులు.. ఒక్కరూ లేరు విద్యార్థులు..

తెలంగాణ, పశ్చిమ బెంగాల్ టాప్

దేశవ్యాప్తంగా మొత్తం 10 లక్షల 13 వేల ప్రభుత్వ పాఠశాలలు (Government Schools) ఉండగా వాటిలోని 5,149 స్కూల్స్‌లో (6.42 శాతం బడుల్లో) ఒక్క విద్యార్థి కూడా లేకపోవటం గమనార్హం. ఇందులోని తెలంగాణ (Telangana), పశ్చిమ బెంగాల్‌(West Bengal)కు చెందిన 70 శాతానికి పైగా బడుల్లో గత విద్యా సంవత్సరం ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం (Central Government) వెల్లడించింది. 10 కన్నా తక్కువ లేదా సున్నా నమోదు ఉన్న పాఠశాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని విద్యా మంత్రిత్వ శాఖ (Ministry Of Education) ఇటీవల పార్లమెంట్‌కి తెలిపింది.

- Advertisement -

ఈ పాఠశాలల సంఖ్య గత రెండేళ్లలో 24 శాతం పెరిగాయి. 2022-23లో 52,309 ఉండగా 2024-25లో 65,309కి చేరాయి. ఈ పాఠశాలల సంఖ్య తెలంగాణలో 2,081 ఉండగా పశ్చిమ బెంగాల్‌లో 1,571 ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ జిల్లాల్లో ఈ స్కూల్స్ ఎక్కువ(315)గా ఉన్నాయి. ఈ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తమ్మీద కూడా అత్యధికం కావటం గమనార్హం. ఆ తర్వాత 167 బడులతో మహబూబాబాద్‌, 135 స్కూల్స్‌తో వరంగల్ ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News