Homeహైదరాబాద్‌Cancer Awareness | క్యాన్సర్‌కు ప్రభుత్వాలదే ప్రధాన బాధ్యత

Cancer Awareness | క్యాన్సర్‌కు ప్రభుత్వాలదే ప్రధాన బాధ్యత

  • ఓయూ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల క్యాన్సర్ అవేర్నెస్ ఫ్లాష్ మాబ్

వరల్డ్ క్యాన్సర్డే ను పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం విద్యార్థులచే క్యాన్సర్ అవేర్నెస్ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఆర్ట్స్ కళాశాల యూనిట్,ఓఈస్టర్ (OYSTER), ఎస్‌కేటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాల ద్వారా క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాసిం మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాప్తికి ప్రధాన బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు.

OU Students Raise Cancer Awareness Through Flash Mob

కలుషిత ఆహారం,నీరు,రసాయనిక ఎరువులు,ప్లాస్టిక్ వినియోగం క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.క్యాన్సర్ నివారణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేయాలని సూచించారు.ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ తుల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ చలమల్ల వెంకటేశ్వర్లు,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.స్వాతి,పలువురు అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News