విద్యార్థులు క్రీడల్లో రాణించి పాఠశాలకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పి ఆర్ టి యు టి ఎస్ మండల అధ్యక్షులు ఉడత రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న హారిక, మహాలక్ష్మి, అక్షితలు ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన రన్నింగ్ ,లాంగ్ జంప్ , షాట్ పుట్ లో మొదటి, మూడు స్థానల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనందుకు గాను పి ఆర్ టి యు టి ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను సన్మానించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో రాణించి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడానికి కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ శంకరయ్య, ప్రధానోపాధ్యాయురాలు వసంత లను ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ టి యు రాష్ట్ర బాధ్యులు రవీందర్ ,శ్రీధర్ బాబు, బద్రీనాథ్, జిల్లా బాధ్యులు నాగరాజు శ్రీనివాస్ సీనియర్ ఉపాధ్యాయులు పద్మజా, ప్రమీల, భారతి ,రజిత, మాలల్ రావు, ప్రశాంత్, రాము, బలరాం నాయ క్, తక్షణమూర్తి పాల్గొన్నారు
