కరీంనగర్ రూరల్ సీఐ హెచ్చరిక
కరీంనగర్, నవంబర్ 5 (ఆదాబ్ హైదరాబాద్): కరీంనగర్ రూరల్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో (Checkings) అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. ఎలబోతారం గ్రామానికి చెందిన పైడి అజయ్, వల్లంపహాడ్ గ్రామానికి చెందిన భాశవేణి రాజు తమ యజమాని బుజ్జం తిరుపతి సూచనల మేరకు వల్లంపహాడ్ వాగు నుంచి ఎలాంటి అనుమతులు (Permissions) లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా (Illegal Transportation Of Sand) చేస్తుండగా కరీంనగర్ రూరల్ పోలీసులు తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద పట్టుకున్నారు.

నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి చర్య నిమిత్తం కోర్టు(Court)కు పంపారు. కరీంనగర్ రూరల్ సీఐ (Karim Nagar Rural CI) ఎ.నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో అక్రమ ఇసుక రవాణా చేసి, మరొకసారి పట్టుబడినట్లయితే వారి ట్రాక్టర్లను సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ (Deposit) చేస్తామని చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్(PD Act) కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
